Thursday 16 May 2013

దేశ భక్తి గీతం


పొట్టు


 పొట్టు

పూర్తి ధ్యాసతో, పెదాలు బిగపట్టి, సమస్థ విశ్వం అదే అయినట్టు
పూర్తిగా నిమగ్నమయిపోయి
చెక్కుతారు కదా పిల్లలు అలా

వంకర టింకరగా, ఆ పెన్సిల్ని

ఆనక గజిబిజిగా గోడలపైనో
కాగితాలపైనో, మరిక నీపైనో
బొమ్మలు వేయడానికీ, రాసుకోడానికీ, ముల్లు విరిగితే, తిరిగి
మళ్ళా చెక్కుకోడానికీ, మరి

నువ్వూ అంతే - అంతే శ్రద్ధతో
వేళ్ళ మధ్య పొందికగా పుచ్చుకుని, ఒక చిరునవ్వుతో, సహనంతో
నింపాదిగా చెక్కుతావు నన్ను-

(ఎలా అంటే, నేను, నువ్వు ఆడుకునే ఒక బొమ్మని అయినట్టూ
ఇక నిన్ను విడిచి నేను
ఎక్కడికీ వెళ్ళిపోలేనట్టు)

ఆఖరికి ఇక్కడ, ఇప్పుడు

చెక్కీ చెక్కీ చెక్కీ అలసిపోయి నువ్వూ, అరిగీ అరిగీ అరిగీ, ఇక
ఏమీ మిగలక, గాలికి కొట్టుకు
వెళ్ళే చెక్కపొట్టునై నేను -ఇక

ఈ కాగితంపై మిగిలేది ఎవరు? 

Monday 12 November 2012

నీది? నాది?

నీది? నాది?
నాది నాది అంటూ ప్రాకులాటలెందుకోయ్!
నాది నాది అంటున్నది నీది కానే కాదోయ్!
నాది అనునది ఈ లోకంబున ఏది లేదోయ్!
ఇది అంతయు సర్వేస్వరుని లీలా విలాసమేనోయ్!
Thanks: Naenu Naa thelugu(Chalapathi Babu blogspot)


ఆవులు – సింహం

ఆవులు – సింహం
 ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి, ఒకే దగ్గర మేత మేస్తూవుండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా అవి నాలుగు కలిసి కట్టుగా వెళ్లేవి. ఆనందంగా జీవించేవి. ఒకనాడు ఒక సింహం ఆ దారినపోతూ ఆవులను చూసి ‘‘ నాకు మంచి విందు భోజనం దొరికిందని’’ అనుకుంటూ. మేస్తున్న ఆవుల వద్దకు గాండ్రీంచుకుంటూ వచ్చింది. సింహం రావడం గమనించిన ఆవులు భయపడక నాలుగు ఆవులు కలసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకినాయి. నాలుగు ఆవులు కలసి కట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది. కొంతకాలం తర్వాత తమలో తాము పోట్లాడుకొని, విడిపోయి వేరువేరు ప్రాంతాలలో మేత మేయ సాగినవి. ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క ఆవును వరుసగా విడివిడిగా చంపితిన్నది  ఈ కథ లోని నీతి : అందరు కలసి జీవించడంలో ప్రమాదాలకు తావులేదు. 
Thanks: Apherald.com